అంగన్‌‌వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

గాంధీ జయంతి, ఐసీడీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్మికుల నిరసన పలమనేరు, అక్టోబర్ 02 ( గరుడ ధాత్రి ) : మహాత్మా గాంధీ 157వ జయంతి, ఐసీడీఎస్ 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలమనేరు ప్రాజెక్ట్ బాబూజీ మున్సిపల్ పార్కులో అంగన్‌వాడీ కార్యకర్తలు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ , ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు....