GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:32 am Digital Edition : GURU SWAMY

అంగన్వాడీల్లో చిన్నపిల్లలకు తాజా వేడి వండిన ఆహార పంపిణీ అందించాలి

కార్వేటి నగరం సెప్టెంబర్ 21 (గరుడదాద్రి న్యూస్): అంగన్వాడీ కేంద్రాలలో చిన్న పిల్లలకు తాజాగా వేడిగా తయారుచేసిన ఆహారాన్ని పిల్లలకు అందించాలని అంగన్వాడి సూపర్వైజర్ రోజా రమణి అన్నారు.
కార్వేటినగరం మండలం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గాజంకి సచివాలయం, అంగన్వాడీ కేంద్రాల్లో ఐసిడిఎ పోషణ మాసం-2024 అంగన్వాడీల్లో చిన్నపిల్లలకు తాజా వేడి
వండిన ఆహార పంపిణీ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సూపర్వైజర్ రోజా రమణి మాట్లాడుతూ తల్లులను ఉద్దేశించి
పోషణ మాసం-2024 మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమములో భాగంగా
మనం తీసుకున్న ఆహారంలో పోషక విలువలు కలిగిన ప్రోటీన్లు అధికంగా
ఉండే ఆహారం తీసుకోవాలని ఆకుకూరలు, కాయగూరలు, మాంసం,
గుడ్లు, చేపలు, ఆహారాలు తీసుకోవాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు వేడి రుచికరమైన పోషక విలువలతో
కూడిన భోజనం అందిస్తున్నాము. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు
తోడ్పడుతున్నాము.ఈ కార్యక్రమంతో
అంగన్వాడీ కార్యకర్తలు కుమారి, రాధమ్మ, చంద్రకళ, రేవతి, పుష్ప
తల్లులు హాజరైనారు.