అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు

పలమనేరు, ఆగస్టు 06 ( గరుడ ధాత్రి ) : అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పలమనేరు అర్బన్ సెక్టారు పరిధిలోని హెచ్.డబ్ల్యూ అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిడిపిఓ ఉమారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ నజ్మా, సిడిపిఓ ఉమారాణి గర్భవతులు, బాలింతలు మరియు తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై పలు సూచనలు, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమారాణి మాట్లాడుతూ... తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని పేర్కొన్నారు. ప్రసవం తర్వాత వచ్చే మొదటి పాలు...