అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఎంపికకు ఇంటర్వ్యూలు

పలమనేరు, అక్టోబర్ 01 ( గరుడ ధాత్రి ) : పలమనేరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో పలమనేరు డివిజన్ పరిధిలోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు సమర్పించిన విద్యార్హతలు, వయస్సు, కుల ధ్రువీకరణ, నివాస తదితర ధ్రువపత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలమనేరు రెవెన్యూ డివిజనల్...