అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం – పిచ్చాటూరు ఐసిడిఎస్ సిడిపిఓ కే.రాజేశ్వరి
పిచ్చాటూరు సెప్టెంబర్ 19 గరుడధాత్రి : పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల్లో ఖాళీగా ఉన్న 19 అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని పిచ్చాటూరు, నాగలాపురం, కేవీబీ పురం, నారాయణవనం మండలాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉన్న ఈ ఖాళీలను గుర్తించి, సామాజిక రిజర్వేషన్ల ఆధారంగా రోస్టర్ వివరాలను వెల్లడించారు. మండలాల వారీగా ఖాళీల వివరాలు ఇలా.. పిచ్చాటూరు మండలం పిచ్చాటూరు-1 (ఓసీ పీహెచ్‌సీ-వీహెచ్), రామాపురం మెయిన్ (ఓసీ ఈడబ్ల్యూఎస్),...