అంగన్‌వాడీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఏఐటీయూసీ నాయకుల పిలుపు పలమనేరు, అక్టోబర్ 10, గరుడ ధాత్రి : అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర 8వ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో చిత్తూరులో మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, గుజరాత్ హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని నెలకు...