అంగరంగవైభవంగా జరుగుతున్న కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు
చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామిగా దర్శనమిచ్చిన కళ్యాణ వెంకన్న - హంసపై జ్ఞాన సరస్వతిగా కళ్యాణ వెంకటేశ్వరుడు నారాయణవనం, మే 29, గరుడ ధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా మండల కేంద్రమైన నారాయణవనం లో వెలిసిన టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ పద్మావతి దేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలులో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం చిన్న శేష వాహనంపై వేణుగోపాలస్వామిగా, రాత్రి హంస వాహనంపై జ్ఞాన సరస్వతిగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు....