అంగరంగ వైభవంగా కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు
-చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామిగా దర్శనం -హంస వాహనంపై జ్ఞాన సరస్వతిగా కళ్యాణ వెంకటేశ్వరుడు నారాయణవనం, మే 29 గరుడ ధాత్రి : తిరుపతి జిల్లా నారాయణవనంలో వెలసిన టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ పద్మావతి దేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఉదయం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు చిన్నశేష వాహనంపై వేణుగోపాలస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో స్వామి...