GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 10:48 pm Digital Edition : GURU SWAMY

అంగరంగ వైభవంగా డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు కుమార్తె ప్రశాంతి నిశ్చితార్థం

గుంటూరు, సెప్టెంబర్ 4 గరుడధాత్రి :

ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ద్వితీయ కుమార్తె ప్రశాంతి నిశ్చితార్థ వేడుకలు గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం అంగరంగ వైభవంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలు సందడిగా సాగాయి.
అమెరికాలో ఉన్న నూతన వధూవరులు లైవ్ ద్వారా నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొనగా, ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రత్యక్షంగా హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
ఈ శుభకార్యానికి అడ్వకేట్ డాక్టర్ ఎస్. నాగరాజుతో పాటు జెసీఐ అల్యూమిని క్లబ్ సభ్యులు హాజరై నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జాతీయ జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు కే. శ్రీనివాసులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. విశ్వనాథ్, కోశాధికారి పైలా రాజారమేష్, సమత జాతీయ అధ్యక్షురాలు స్వరాజ్యలక్ష్మి, నాయకురాలు సుజాత, ఏసీఎఫ్ అధ్యక్షులు, జెసీఐ అల్యూమిని క్లబ్ నాయకులు నూతలపాటి నాగేశ్వరరావు, శంకర్ తదితర సామాజిక రంగ ప్రముఖులను డాక్టర్ ఎస్. నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు.
నిశ్చితార్థ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సందడి మధ్య ఘనంగా జరిగాయి. నూతన వధూవరుల వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండాలని పలువురు ఆకాంక్షించారు.