అంగరంగ వైభవంగా డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు కుమార్తె ప్రశాంతి నిశ్చితార్థం
గుంటూరు, సెప్టెంబర్ 4 గరుడధాత్రి : ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు ద్వితీయ కుమార్తె ప్రశాంతి నిశ్చితార్థ వేడుకలు గుంటూరులోని రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం అంగరంగ వైభవంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలు సందడిగా సాగాయి. అమెరికాలో ఉన్న నూతన వధూవరులు లైవ్ ద్వారా నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొనగా, ఇరు కుటుంబాల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రత్యక్షంగా హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి భవిష్యత్...