అండర్-14 ఎస్.జి.ఎఫ్.ఐ. రాష్ట్ర జట్టుకు తీర్థం 8వ తరగతి విద్యార్థి యశ్వంత్ ఎంపిక

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్4 బైరెడ్డిపల్లి మండలం జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం పాఠశాల క్రీడా రంగంలో మరోసారి తన ప్రతిభను చాటుకుంది. తిరుపతిలో నిర్వహించిన అండర్–14 ఎస్.జి.ఎఫ్.ఐ. హ్యాండ్‌బాల్ ఎంపికల్లో జెడ్పీహెచ్‌ఎస్ తీర్థం 8వ తరగతి విద్యార్థి యశ్వంత్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. తీర్థం జెడ్పీహెచ్‌ఎస్ నుంచి హ్యాండ్‌బాల్‌లో రాష్ట్రస్థాయికి ఎంపికైన తొలి విద్యార్థిగా యశ్వంత్ నిలవడం పాఠశాలకు ప్రత్యేక గౌరవాన్ని తీసుకువచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి రాష్ట్రస్థాయికి ఎదగడం పట్ల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తీర్థం గ్రామ...