GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 7:41 am Digital Edition : GURU SWAMY

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలి – ఎంపీడీవో మహమ్మద్ రఫీ

పిచ్చాటూరు, జూన్ 10 గరుడధాత్రి :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 21న నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో మండల ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) మహమ్మద్ రఫీ కోరారు.
ఈ సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను ప్రజలకు, విద్యార్థులకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ సహాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.
యోగ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎంపీడీవో మహమ్మద్ రఫీ విజ్ఞప్తి చేశారు.