అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలి – ఎంపీడీవో మహమ్మద్ రఫీ
పిచ్చాటూరు, జూన్ 10 గరుడధాత్రి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 21న నిర్వహించనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో మండల ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) మహమ్మద్ రఫీ కోరారు. ఈ సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను ప్రజలకు, విద్యార్థులకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ ఆధార్ నంబర్ మరియు మొబైల్ నంబర్ సహాయంతో రిజిస్ట్రేషన్...