GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 7:24 pm Digital Edition : GURU SWAMY

అందరిదీ ఒకే లక్ష్యం… అది మహానాడు ఘనవిజయం…

అందరిదీ ఒకే లక్ష్యం… అది మహానాడు ఘనవిజయం.

చారిత్రాత్మక మహానాడు ఘనవిజయం కోసం ఐక్యంగా కదిలిన జిల్లా టిడిపి నేతలు.

సభా వేదికల ఎంపిక నుంచి రవాణా వరకు వేగంగా సాగుతున్న ఏర్పాట్లు.

వసతి, రవాణా, వేదికలు…. అన్నింటిలో సమన్వయంతో సాగుతున్న ఏర్పాట్లు.

మహానాడు కార్యక్రమాన్ని ఘనవిజయంగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా టిడిపి నాయకులు ఐక్యంగా కదిలారు. జిల్లాలో తొలిసారిగా మహానాడు నిర్వహించబడుతున్న నేపథ్యంలో, దీనిని చారిత్రాత్మకంగా నిలపాలనే లక్ష్యంతో జిల్లా నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

సభ నిర్వహణకు అనుకూలమైన ప్రదేశాల ఎంపిక కోసం మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కావ్య కృష్ణా రెడ్డి, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, కనీస వేతనాల సలహా బోర్డు చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి పట్టాభి రామిరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి లు పలు వేదికలను పరిశీలించారు. అలాగే సౌకర్యాలు, ప్రజా రాకపోకలు, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వేదికల ఎంపిక నుంచి రవాణా ఏర్పాట్ల వరకు ప్రతి అంశాన్ని ఎంతో ప్రణాళికబద్ధంగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల సమీకరణ, వసతి ఏర్పాట్లు, వాహనాల సమన్వయం వంటి అంశాల్లో నాయకులు బాధ్యతలు పంచుకొని ముందుకు సాగుతున్నారు. వసతి, రవాణా, వేదికలు వంటి కీలక అంశాల్లో సమన్వయంతో సాగుతున్న ఈ ఏర్పాట్లు మహానాడు విజయానికి బలమైన పునాది వేస్తున్నాయి. జిల్లా మొత్తం ఒకే లక్ష్యంతో కదులుతుండటం మహానాడు ఘనవిజయానికి దారి తీస్తుందని విశ్వసిస్తున్నారు.