GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 7:22 am Posted by : GARUDA DHATRI NEWS

అందరూ సమన్వయంతో పనిచేసి మహానాడు ను విజయవంతం చేయాలి… పరిశీలకురాలు పర్వీన్ తాజ్

గరుడధాత్రి న్యూస్ :
ఈనెల 27, 28 తేదీలలో జరగబోయే తెలుగుదేశం పార్టీ డిజిటల్ మహానాడులో నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి నియోజకవర్గ టిడిపి
పరిశీలకురాలు పర్వీన్ తాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం 12వ క్లస్టర్ పరిధిలోని ఇన్చార్జిలతో పరిశీల కురాలు పర్వీన్ తాజ్ మహానాడు పై సమావేశం అయ్యారు. అంతకుమునుపు పరిశీలకురాలు పర్వీన్ తాజ్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ లకు టిడిపి మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి, తిరుపతి కోపరేటివ్ బ్యాంకు మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా నేతృత్వంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు షబ్బీర్, పట్టణ మైనారిటీ కార్యదర్శి ముబారక్, అహమ్మద్ లు ఘన స్వాగతం పలికారు. షేక్ మహబూబ్ బాషా శాలువాతో పరిశీల కురాలు పర్వీన్ తాజ్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పర్వీన్ తాజ్ మాట్లాడుతూ డిజిటల్ మహానాడులో పార్టీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని అందుకు ఒకరిని ఓకరు సమన్వయం చేసుకొని ముందుకు సాగాలన్నారు. మహానాడు ను విజయవంతం చేసేందుకు కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలని ఆయా కార్యక్రమాలను ఆమె పర్యవేక్షించి పలు సూచనలను, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి నగర మహిళా అధ్యక్షురాలు ర్యాంకు శాంతమ్మ, జిల్లా కార్యదర్శి రేవతి పార్టీ నాయకులు పాల్గొన్నారు.