-జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు సీఎం ఆదేశాలు
సత్యవేడు నేతలకు సీఎం క్లాసు
సత్యవేడు గరుడధాత్రి న్యూస్ :
సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక, ఎర్ర మట్టి అక్రమ తరలింపు పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఈ అక్రమ రవాణాను ఆపాలని, అవసరమైతే కేసులు పెట్టాలని కూడా సీఎం జిల్లా ఎస్పీ, కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.
-బుధవారం రాత్రి శ్రీ సిటీలో సిఎం చంద్రబాబు బస చేశారు
ఆ సందర్భంగా స్థానిక టిడిపి నాయకులు, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో ముఖ్యమంత్రి ప్రత్యేక పంచాయతీ నిర్వహించారు
నియోజకవర్గ పరిధిలో ఏ నాయకుడు, ఎలా పనిచేస్తున్నాడో అందరి డేటా నా దగ్గర ఉంది.. పద్ధతిగా మారుతారని అవకాశమిస్తే… నియోజకవర్గాన్ని పాడు చేస్తారా అంటూ కూడా చంద్రబాబు విరుచుకుపడినట్లు సమాచారం.
సత్యవేడు ప్రజలు చాలా మంచివారు… నేను ఎవరిని అభ్యర్థిగా పంపిస్తే… వారిని గెలిపిస్తున్నారు… బంగారం లాంటి నియోజకవర్గాన్ని మీ ఆధిపత్య పోరు… అక్రమ దోపిడీకి బలి పశువు చేయడం ఎంతవరకు న్యాయమంటూ సీఎం స్థానిక నాయకులను ప్రశ్నించారు. ఆదిమూలం, ఆయన మద్దతు దారులు, శంకర్ రెడ్డి, ఆయన ప్రధాన అనుచరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు
ఆదిమూలం విషయంపై సీఎం మాట్లాడుతూ.. మీరు ఇంకా మారలేదు… వ్యక్తిత్వం దెబ్బతింటే ఇబ్బందులు తప్పదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పకుండా మీరు చెప్పినట్లు నడుచుకుంటా అంటూ ఎమ్మెల్యే సీఎం వద్ద చెప్పుకు వచ్చారు.
నియోజకవర్గంలో ఏ నాయకుడు ఎలా పని చేస్తున్నాడో పూర్తి డేటా నా దగ్గర ఉంది.. తమాషాలు వద్దు… సీరియస్ వార్నింగ్ ఇస్తున్న… ఐక్యమత్యంతో ముందుకెళ్లండి అంటూ కూడా చంద్రబాబు క్లాస్ పీకారు.
పార్టీలో సీనియర్లకు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇక్కడ ఉండడం లేదు,
ఇక నుంచి అలా జరగదు… జరిగితే సహించేది లేదు అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.