అటవీ భూముల సరిహద్దుల్లో అక్రమ మట్టి తవ్వకాలు..!
గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం, చెదులపాకం గ్రామాల పరిధిలో అటవీ భూముల సరిహద్దులను ఆనుకుని అక్రమ మట్టి తవ్వకాలు, తరలింపులు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అటవీ భూములకు ఆనుకుని ఉన్న బఫర్ జోన్ ప్రాంతాల్లో భారీగా మట్టి తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు, ఏ ఉద్దేశంతో ఈ అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారన్న విషయం తెలిసినా అధికార యంత్రాంగంలో చలనం కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా అటవీ భూములను ఆనుకుని...