అణు కలలు వీడే వరకు.. దిగ్బంధనంలోనే హర్మూజ్‌

*అణు కలలు వీడే వరకు.. దిగ్బంధనంలోనే హర్మూజ్‌* * ఇరాన్‌ అణు కలలను వీడే వరకు కీలక హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనంలోనే ఉంటుందని అమెరికా రక్షణ శాఖమంత్రి పీట్‌ హెగ్సెత్‌ స్పష్టం చేశారు. ఆ జలసంధిని అమెరికా నేవీ ఉక్కుకవచంలా బంధించిందన్నారు. అవసరమైనంతకాలం ఆ దిగ్బంధనం కొనసాగుతుందన్నారు. ఇరాన్‌పై ఒత్తిడి తెస్తూనే ఉంటామన్నారు. హర్మూజ్‌లో ఏ నౌకా ప్రయాణించదని, దానిపై తమ పూర్తి నియంత్రణ ఉందన్నారు. అంతర్జాతీయ స్థిరత్వం కోసమే ఈ ప్రమాదకర ఆపరేషన్‌ చేపట్టినట్లు వెల్లడించారు.