GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:35 pm Digital Edition : GURU SWAMY

అత్యంత వైభవంగా కాణిపాకంలో పుష్ప పల్లకి సేవ

పుష్ప పల్లకిలో కిక్కరించిన జన సందోహం

కాణిపాకం అక్టోబర్ 4 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి పుష్ప పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఉదయ దారులు స్వామివారికి నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు ఆలయం కళ్యాణ వేదికలో అభిషేకం నిర్వహించారు. రాత్రి ఉభయ దారులుస్వామి వారికి పూజలు నిర్వహించి స్వామివారిని ఆలయం నుండి ఉభయ దారులు తీసుకొచ్చి పుష్ప పల్లకిపై స్వామివారిని ప్రతిష్టించి పురవీధుల్లో వాయిద్య బృందాలు కోలాటాలు భజనలు నడుము పుష్ప పల్లకిపై స్వామివారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెంచల కిషోర్. చైర్మన్ మనీ నాయుడు. ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు శివ శంకరి. పాలక మండలి సభ్యులు వసంత. అనసూయమ్మ,.కృష్ణవేణి. చంద్రశేఖర్ రెడ్డి. నరేష్. శివ కుమార్. సతీష్. నాగరాజు నాయుడు. పెరుమాళ్ సుబ్రమణ్యం రెడ్డి. కత్తి సుధాకర్ రెడ్డి. ఏఈఓ రవీంద్రబాబు. సూపర్డెంట్లు వాసు. కోదండపాణి. టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజీ నాయుడు.రవి. ఉభయ దారులు ఆలయ సిబ్బంది అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి *పుష్పపల్లకి సేవ* పై సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారు కాణిపాకం పురవీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు, ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, మరియు ఈ.ఓ, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఉభయదారులు, ఆలయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.