GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 6:46 pm Posted by : GARUDA DHATRI NEWS

అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవల వినియోగం

నాగలాపురం మండలంలోని బీరకుప్పం హరిజనవాడలో ఈ రోజు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా గంజా వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, మహిళలపై జరిగే నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవల వినియోగం, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలపై అవగాహన కల్పించబడింది.

అదేవిధంగా ప్రజలు చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరడమైనది.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని తమ సమస్యలను తెలియజేసి, పోలీసులకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు.