GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:56 pm Digital Edition : GURU SWAMY

అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా…!

– స్వల్ప గాయాలతో బయటపడ్డ అజయ్

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్21 :

బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామ పంచాయితీ
కూటాల వంక గ్రామానికి చెందిన అజయ్ సోమవారం ద్విచక్రవాహనంపై బైరెడ్డిపల్లి కి వెళుతుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడడం జరిగింది. ఈ ప్రమాదం లో వాహన చోదకుడుకి స్వల్ప గాయాలుఅయినది.
ఈసంఘటనను వాహన చోదకులు 108 కు సమాచారం తెలపడంతో వారు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని భాధితుడిని బైరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు .
ప్రస్తుతం బైరెడ్డిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అజయ్ చికిత్స పొందుతున్నాడు.పూర్తి సమాచారం తెలియాల్సివున్నది.