అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా…!

- స్వల్ప గాయాలతో బయటపడ్డ అజయ్ బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్21 : బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామ పంచాయితీ కూటాల వంక గ్రామానికి చెందిన అజయ్ సోమవారం ద్విచక్రవాహనంపై బైరెడ్డిపల్లి కి వెళుతుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైరెడ్డిపల్లి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడడం జరిగింది. ఈ ప్రమాదం లో వాహన చోదకుడుకి స్వల్ప గాయాలుఅయినది. ఈసంఘటనను వాహన చోదకులు 108 కు సమాచారం తెలపడంతో వారు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని భాధితుడిని బైరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు...