అద్దె ఇంట్లో మగ్గం నేస్తే నేతన్న కాదా..?
– నేతన్న సేవలో అద్దె చేనేతలకు న్యాయం చేయాలని దేవాంగ అభ్యుదయ సేవా సంఘం విజ్ఞప్తి సత్యవేడు, ఆగస్టు 06 గరుడధాత్రి: రాష్ట్రవ్యాప్తంగా అద్దె ఇళ్లలో నివసిస్తూ సంప్రదాయ చేనేత వృత్తిని కొనసాగిస్తున్న వేలాది మంది నేతన్నలకు "నేతన్న సేవ" పథకం అమలులో జరుగుతున్న అర్హత ప్రమాణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సొంత ఇల్లు లేని కారణంగా అద్దె ఇళ్లలో మగ్గం నేస్తున్న చేనేత కుటుంబాలను అనర్హులుగా పరిగణించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ దేవాంగ అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులు గుత్తి త్యాగరాజు...