అన్నదాత సుఖీభవతో రైతులకు పెట్టుబడి భారం తగ్గింపు -జడ్పీటీసీ కూరపాటి విజయలక్ష్మి

సత్యవేడు, జూన్ 20 గరుడధాత్రి : రైతులకు వ్యవసాయ పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోందని సత్యవేడు జడ్పీటీసీ సభ్యురాలు కూరపాటి విజయలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక వ్యవసాయ ఏడీ కార్యాలయంలో వ్యవసాయ ఏడీ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ మెగా చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు...