GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:33 pm Digital Edition : GURU SWAMY

అన్నూరు, పాదిరికుప్పం గ్రామాల్లో పొలంపిలుస్తుంది

కార్యక్రమం కార్వేటినగరం ఆగస్టు 4 (గరుడదాద్రి న్యూస్) : కార్వేటి నగరం మండలం అన్నూరు పాదిరి కుప్పం గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి హేమలత మాట్లాడుతూ సూపర్ ఎల్నినో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, ప్రత్యామ్నాయ పంటలు ఏవీ వేసుకోవాలి అని రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది, నీటి ఎద్దడి పరిస్థితుల కారణంగా వరి పంటను వేయవద్దని రైతులకు సూచించడం జరిగింది, పంటను నీటి ఎద్దడి వల్ల ఎండుతున్న పంటను కాపాడేందుకు 2 శాతం యూరియా ( 20 గ్రాములు యూరియా) లేదా డి ఏ పి 5 గ్రా లేదా 19-19-19- 5 గ్రా, లేదా పొటాషియం నైట్రేట్ – 5 గ్రా , పై వాటిలో ఏదో ఒకటి లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. అలాగే ఇప్పటికే వరి పంట వేసిన రైతన్నలు తప్పకుండా ఎకరానికి 840 కట్టి ఇన్సూరెన్స్ తప్పకుండా చేసుకోవాలి , చివరి తేదీ ఈ నెల 15 అని తెలుపడమైనది. ప్రత్యామ్నాయ పంటలుగా జొన్న, సజ్జ, ఆముదం లేదా కంది వేసుకోవాలి. ఆమె తెలిపారు.