అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి దివ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
జూన్ 25న ధ్వజారోహణంతో వైభవోత్సవాల ప్రారంభం గోవింద నామస్మరణతో మారుమోగనున్న అప్పలాయగుంట అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మేదినిపూజ నిర్వహించి, అనంతరం సేనాధిపతి ఉత్సవాన్ని చేపట్టారు. సంప్రదాయం ప్రకారం శ్రీ విష్వక్సేనులవారు నాలుగు మాడవీధుల్లో విహరించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేలా అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అనంతరం యాగశాలలో...