అభిమానుల సందడి మధ్య.. ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

పిచ్చాటూరు, ఆగస్టు 22 గరుడధాత్రి : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని పిచ్చాటూరులో అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పిచ్చాటూరు మీ సేవ నిర్వాహకులు విజయ్ @ జార్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమాన నటుడిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ @ జార్జి మాట్లాడుతూ.. చిరంజీవి అనే పేరు వినగానే కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ కళ్లముందు మెదులుతుందని అన్నారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో...