GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:53 pm Digital Edition : GURU SWAMY

అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం

బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ముని రాజా యాదవ్

ఏర్పేడు ఆగస్టు 4: అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఇంటింటికి టిడిపి 9వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని ఏర్పేడు మండలం అంజిమేడు, సీతారాంపేట, ఏర్పేడు గ్రామాల నందు విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొడుగుమునిరాజు యాదవ్ మంగళవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ బీసీ కులాలకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతున్నదని గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నద న్నారు .ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు నుంచి విశేష స్పందన లభిస్తున్నదన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వం పనితీరు అభినందిస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు ఆనంద వ్యక్తం చేస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతున్నదన్నారు. సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసే దానికి ఒక సైనికులాగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు, పార్లమెంట్ మహిళ కార్యదర్శి కృష్ణవేణి, సింగిల్ విండో చైర్మన్ మహేష్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు శివశంకర్ రెడ్డి, సూరి నాయుడు, ధనుంజయ నాయుడు, మోహన్ నాయుడు, కేశినేని సుబ్రహ్మణ్యం, గుణ యాదవ్, దేవేందర్ నాయుడు రాచేటి సుబ్రమణ్యం, కేకే రమణ, మునయ్య, బాలాజీ రెడ్డి బాల కుమారస్వామి టిడిపి కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.