GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 7:34 pm Digital Edition : GURU SWAMY

అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ..ఇంటింటికినాయకులతో కలిసి కరపత్రాలు పంపిణీ

కార్వేటి నగరం ఆగస్టు 4 (గరుడ దాద్రి న్యూస్):
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ. నాయకుల తో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్న కరపత్రాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి వడియం గాడు రాజా కార్వేటి నగరం మేజర్ పంచాయతీలు నిర్వహించారు.రెండేళ్ల ప్రభుత్వ పాలన ఇంటింటి ప్రచారం” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు సారథ్యంలో, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగనంతగా అభివృద్ధిపనులుజరుగుతున్నాయని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలుఅందుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు డైరెక్టర్ నగలపాటి నాగేశ్వరరాజు , జిల్లా ఉపాధ్యక్షులు రవి యాదవ్ సింగిల్ విండో అధ్యక్షులు జనార్దన్ రాజు, వాసుదేవ రెడ్డి, వేలాయుధం, హేమంత్ రెడ్డి, సోమశేఖర్ ,సొమ, జగన్నాథం, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.