GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 7:06 pm Digital Edition : GURU SWAMY

అమ్మవారి సేవలో గోవా మంత్రి రోహన్ ఖౌంటే

తిరుచానూరు, ఆగస్టు 02 (గరుడధాత్రి న్యూస్)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని గోవా పర్యాటక శాఖ, సమాచార సాంకేతికత (ఐటి), ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ప్రింటింగ్ & స్టేషనరీ శాఖ మంత్రి రోహన్ ఖౌంటే ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.