GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:46 pm Digital Edition : GURU SWAMY

అమ్మవారి సేవలో ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు

తిరుచానూరు, జూలై 31 (గరుడధాత్రి న్యూస్)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్ మునిచెంగల్రాయులు, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.