GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 9:11 pm Posted by : GARUDA DHATRI NEWS

అరణియారు ప్రాజెక్టు పరిసరాల్లో చెత్త వేస్తే చర్యలు తప్పవు -హెచ్చరిక బోర్డు ఏర్పాటు

పిచ్చాటూరు మండలంలోని అరణియారు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి చెత్తాచెదారాలు, నిర్మాణ వ్యర్థాలు (బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్) వేయరాదని ప్రజలకు అవగాహన కల్పించేందుకు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమం మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) మహమ్మద్ రఫీ గారి సమక్షంలో నిర్వహించబడింది. ప్రాజెక్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు తెలిపారు.
అరణియారు ప్రాజెక్టు ప్రాంతంలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు లేదా ఇతర కాలుష్యకర పదార్థాలను పారబోసే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ సహకరించి ప్రాజెక్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీవో మహమ్మద్ రఫీ కోరినట్లు సమాచారం.