అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం
-23 ఏండ్ల యువతిపై గ్యాంగ్‌రేప్.. నగ్న వీడియోలు తీసి బెదిరింపులు.. 8 మంది అరెస్ట్ తిరువణ్ణామలై, తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో సంచరించే అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై దుండగులు దాడి చేయగా, వారిలో ఒక 23 ఏండ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పవిత్ర క్షేత్రంగా భావించే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం భక్తుల్లో భయాందోళనలకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే...