సత్యవేడు జూన్ 1 గరుడధాత్రి :
సుమారు అర్థ కోటికి పైగా విలువచేసే ప్రభుత్వ భూమి చేతులు మారుతున్న పట్టించుకునే దిక్కు లేదు ఇళ్ల స్థలాలు… పట్టాలు… ఇరువర్గాల మధ్య ఎవరికి న్యాయం జరుగుతుందో అని స్థానికులు ఎదురుచూస్తుండగా… ఇదే అదునుగా స్థానికేతరులు ఆ భూమిని స్థానికులకు అమ్మి లక్షలాది రూపాయలు జేబులో వేసుకున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. సత్యవేడు ప్రాంతంలోని కోటమిట్ట ప్రాంతంలో సుమారు 16 సెంట్లు భూముల విషయంపై ఏడాదిన్నరపైగా వివాద నెలకొంది. తమకు 2016లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలుగా ఇచ్చిందని పట్టాలు చూపి… సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని కొందరు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కొందరు ఇదే భూమిని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించగా గత ఏడాది అప్పటి అధికారులు కబ్జాదారులను తరిమికొట్టారని బాధితులు చెబుతున్నారు. ఆ మేరకు అప్పట్లో ప్రజా ఫిర్యాదుల వేదికలో ఫిర్యాదు చేయడంతో కబ్జా ఆగిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా తమకు 2014లోనే ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని, ఒక్కొక్కరికి నాలుగు సెంట్లు చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగిందని స్థానికేతరులు వివాదాలకు తెర తీశారు. 2014లో ఇదే భూమి విషయంపై రిటైర్డ్ హిందీ పండిట్ దివంగత మునుస్వామి, ప్రభుత్వ రెవెన్యూ అధికారుల మధ్య కోర్టులో కేసు జరుగుతోందని, అలాంటప్పుడు పట్టాలు ఎవరికి ఎలా ఇచ్చారో..? అర్థం కావడం లేదు దీనికి తోడు స్థానికేతర్లకు ఒకే కుటుంబంలో నలుగురికి పట్టాలు ఎలా ఇస్తారు..? రెవెన్యూ చరిత్ర లో లేని విధంగా ఒక్కొక్కరికి నాలుగు సెంట్లు చొప్పున పట్టాలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని మరో వర్గం ఆరోపిస్తోంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలిసినా రెవెన్యూ అధికారులు మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఈ 16 సెంట్లు ప్రభుత్వ భూమిని గుట్టు చప్పుడు కాకుండా స్థానికులకు విక్రయించినట్లు సమాచారం. ఆక్రమణకు గురవుతున్న భూముల విషయంపై గత సోమవారం రెవెన్యూ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో కు లిఖితపూర్వకమైన ఫిర్యాదు చేసిన స్పందన లేదు. ఇంకేముంది… ఆ భూముల్లో పక్కాగా భవన నిర్మాణాలు జరిగిపోతున్నాయి. వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూములు రక్షించాల్సిన అధికారులు నిమ్మకు నిరెతినట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని, ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ భూములను స్వాధీనం చేసుకుంటే.,. భవిష్యత్తులో అక్కడి వాసులకు మంచి నీటి పథకం, ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా స్థానికులు సూచిస్తున్నారు.