అర్ధరాత్రి వెలసిన శిలాఫలకం.. ఇదేనా ఆధునికరణ..?
దశాబ్దాల నాటి పంచాయతీరాజ్ భవనానికి హఠాత్తుగా కొత్త శిలాఫలకం సత్యవేడు రాజకీయాల్లో ఇదో కొత్త తరహా ‘కొసమెరుపు’.. అధికారుల స్పందనపై ఆసక్తి సత్యవేడు, సెప్టెంబర్ 26 గరుడధాత్రి దాదాపు ఏడు దశాబ్దాల నాటి పాత పంచాయతీరాజ్ భవనం... అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో నిర్మించినట్లు స్థానికులు చెబుతున్న ఆ భవనానికి తాజాగా అర్ధరాత్రి వేళ కొత్త శిలాఫలకం వెలవడం సత్యవేడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏళ్ల తరబడి ఎలాంటి హడావుడి లేకుండా ఉన్న పాత భవనానికి అకస్మాత్తుగా ‘ఆధునికరణ’ పేరుతో శిలాఫలకం...