అర్హులందరికీ విద్యుత్ సబ్సిడీ చేరేలా చర్యలు తీసుకోండి -ఎంపి గురుమూర్తి
తిరుపతి జిల్లా విద్యుత్ కమిటీ సమీక్ష సమావేశం తిరుపతి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించబడింది. జిల్లా విద్యుత్ కమిటీ చైర్మన్ హోదాలో తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌తో పాటు విద్యుత్ శాఖ ఎస్.ఈ, సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు.ఈసందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ నారాయణవనం పవర్ లూమ్స్ సమస్య, చిట్టమూరు మండలంలోని ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ సరైన విధంగా అందకపోవడం వంటి అంశాల గురించి ఎంపీ వివరాలు కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ...