GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 6:33 am Posted by : GARUDA DHATRI NEWS

అలిపిరి పరిసరాల్లో పుట్ పాత్ లపై దుకాణాలు తొలగించండి

అలిపిరి పరిసరాల్లో పుట్ పాత్ లపై దుకాణాలు తొలగించండి

– డిప్యూటీ కమిషనర్ అమరయ్య

గరుడధాత్రి :

అలిపిరి పరిసరాల్లో భక్తులకు, వాహన చోదకులకు ఇబ్బందికరంగా పుట్ పాత్ లపై ఉన్న దుకాణాలను తొలగించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ అమరయ్య అధికారులు, వ్యాపారస్థులకు సూచించారు. భక్తులు, వాహన చోదకుల పిర్యాదు మేరకు ఏ ఎస్పీ రవి మనోహరాచారి, పోలీస్, నగరపాలక సంస్థ అధికారులతో కలసి అలిపిరి పరిసర ప్రాంతాల్లో పుట్ పాత్ ఫై ఉన్న వ్యాపారస్థులతో మాట్లాడారు. పుట్ పాత్ ఫై వ్యాపారాలు చేయడం వలన ప్రజలతో పాటు భక్తులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అలాగే టిఫిన్ షాప్, దుకాణాల వ్యర్థాలు జూ పార్కు రోడ్డు పక్కనే వేయడంతో వన్యమృగాలు వస్తున్నాయని తెలిపారు. కావున ఇక్కడ ఇబ్బందికరంగా ఉన్న దుకాణాలను ఇక్కడ నుండి తొలగించాలని, లేకుంటే మేమే తొలగించడం జరిగితుందని హెచ్చరించారు. డిప్యూటీ కమిషనర్ వెంట డి ఎస్పీ లు కొండయ్య నాయుడు, భక్తవత్సలం, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, సి ఐ లు రామ కృష్ణ, రామ్ కిషోర్, ఏసీపీ పార్వతి ప్రియ, పోలీస్, హెల్త్, పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఉన్నారు.