GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:02 am Digital Edition : GURU SWAMY

అళ్ళమడుగు గ్రామంలో 24 రోజుల నుంచి కరెంటు అంతరాయం

వెదురు కుప్పం. గరుడ దాద్రి న్యూస్ ఆగస్టు 17
వెదురు కుప్పం మండలం దిగువ పల్లాలు పంచాయతీ ఆళ్లమడుగు హరిజనవాడ గ్రామంలో 24 రోజుల నుంచి వీధి దీపాలు అంతరాయంగా ఉంది. విద్యుత్ అధికారులకు తెలియజేశాము వాళ్ల నుండి ఎటువంటి స్పందన లేదు, మండల విద్యుత్ అధికారి ఎం ఇ కి ఫోటోలు తీసి పంపించాము, వచ్చి చూస్తాము అని చెప్పేది తప్ప ఇంతవరకు రాలేదు వచ్చి చూడలేదు విద్యుత్ అధికారులు వచ్చి విద్యుత్ లైన్ చూడాలని గ్రామస్తులు తెలియజేశారు. ఈ గ్రామానికి ఎప్పుడు మోక్షం కలుగుతుంది అని ఊరి గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ కి తెలియజేస్తున్నాము మా గ్రామానికి విద్యుత్ లైన్ వలన వీధి దీపాలు వెలగడం లేదు రాత్రి సమయంలో విషపురుగులు వీధులలో మరియు ఇంటిలోకి ప్రవేశిస్తున్నాయి. విద్యుత్ అధికారులు నిరలక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. మా గ్రామం లోకి దయవుంచి ఉన్నత అదికారులను పంపించి మరమ్మత్తులు చేయవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.