GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:09 am Digital Edition : GURU SWAMY

అసెంబ్లీలో మొదటి రోజు.. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు ఆగస్టు 17 (గరుడదాత్రిన్యూస్)

ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ హాజరయ్యారు. సోమవారం పలువురు మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. విరామ సమయాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని కలిసి నియోజకవర్గానికి సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడారు. సహచర ఎమ్మెల్యేలతో పలు అంశాలపై చర్చించారు.