మే రెండవ తేదీ న సత్యవేడు పట్టణంలోని బేరసిటి కళ్యాణ మండపం వద్ద జరిగిన జిల్లా 10వ మహాసభలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా తలారి బాలకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాసరి జనార్ధన్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య, సంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసే వాళ్ళ సమస్యలు పరిష్కారం కొరకు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు జిల్లాఅధ్యక్షులుగా తలారి బాలకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాసరి జనార్ధన్ జిల్లా ఉపాధ్యక్షులుగా వందవాసి నాగరాజు నలుగురి రమణయ్య ,కలపాటి గురవమ్మ జిల్లా సహాయ కార్యదర్శులుగా రాజగోపాల్ ,అముదా, వరలక్ష్మి,
జిల్లా కమిటీ సభ్యులుగా కే కృష్ణయ్య, ఎల్లయ్య (సత్యవేడు). సుబ్బయ్య (వరదయ్యపాలెం), బాల గురవయ్య (బుచ్చినాయుడు కండ్రిగ), ఆర్ మురుగేష్ (నాగలాపురం), శంకరయ్య (కెవిబిపురం), రామచంద్రారెడ్డి (పిచ్చాటూరు), టి గురవయ్య ( శ్రీకాళహస్తి) బజ్జ శివయ్య (కోడూరు). లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు మరొక ముగ్గురు సభ్యులనుగా కోఆప్షన్ చేసుకోవాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి బాలకృష్ణ ,దాసరి జనార్ధన్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పటిష్ట అమలుకొరకు, మరియు పేదలకు ఇంటి స్థలాలు,పక్కా ఇల్లు,సాగు భూమి పట్టాల కొరకు శక్తి వచనం లేకుండా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహాసభలకు సహకారం అందించిన పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.