ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా నూతన కమిటీ ఎన్నిక
మే రెండవ తేదీ న సత్యవేడు పట్టణంలోని బేరసిటి కళ్యాణ మండపం వద్ద జరిగిన జిల్లా 10వ మహాసభలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులుగా తలారి బాలకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దాసరి జనార్ధన్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పుల్లయ్య, సంఘం మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసే వాళ్ళ సమస్యలు...