ఆగస్టు 17 నుంచి జిల్లా జనాభా గణాంక హ్యాండ్‌బుక్ సర్వే ప్రారంభం
కార్వేటినగరం, ఆగస్టు 7: (గరుడాదాద్రి న్యూస్): జిల్లా జనాభా గణాంక హ్యాండ్‌బుక్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 15 వరకు నిర్వహించనున్న గ్రామాల మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాల గణనకు సంబంధించి శిక్షణ కార్యక్రమం శుక్రవారం కార్వేటినగరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు.ఈ శిక్షణలో కార్వేటినగరం, పాలసముద్రం మండలాలకు చెందిన సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాల్లో విద్య, వైద్యం, రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, రవాణా, సమాచార సౌకర్యాలు తదితర మౌలిక వసతులు మరియు ప్రజలకు అందుబాటులో ఉన్న వివిధ...