GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:19 pm Posted by : GURU SWAMY

ఆగస్టు 5న బైరెడ్డిపల్లి మండల సర్వసభ్య సమావేశం

బైరెడ్డిపల్లి, జూలై 30 (గరుడదాత్రి):

బైరెడ్డిపల్లి మండల సర్వసభ్య సమావేశం ఆగస్టు 5వ తేదీ (బుధవారం) ఉదయం 10:30 గంటలకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఆనందబాబు తెలిపారు.
ఈ సమావేశానికి మండలంలోని అన్ని ఎంపీటీసీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. అలాగే అన్ని ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరై, సంబంధిత అంశాలపై వివరాలు సమర్పించాలని సూచించారు.