GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 8:06 pm Digital Edition : GURU SWAMY

ఆటపాటలతో పిల్లలకు విద్యాబోధన అందించాలి – సూపర్వైజర్ రోజా రమణి

కార్వేటినగరం అక్టోబర్ 1 గరుడదాద్రి న్యూస్ :
కార్వేటినగరం మండలంలోని ఎల్ ఆర్ పేట పంచాయతీ కొల్లగుంట గ్రామాలలో ఉన్న అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా ఉత్సవ్ కార్యక్రమాన్ని సిడిపిఓ శోభారాణి మేరకు సూపర్వైజర్ రోజా రమణి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ర మాట్లాడుతూ పిల్లలకు అర్థమయ్యేలా ఆటపాటలతో విద్యను బోధించడం మరియు ఆటలను ఆడించి, గర్భవతులకు ఆహారం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించి, చిన్నపిల్లలకు అన్నప్రాసన చేశారు.ఈ కార్యక్రమంలో మహిళా మోక్ష కార్యదర్శి స్నేహభారతి, అంగన్వాడి కార్యకర్తలు చెంచమ్మ,గౌతమి, దేవి, పద్మ, చాముండేశ్వరి, జ్ఞాన సుందరి, సంఘమిత్ర సరస్వతి, మరియు గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు.