కార్వేటినగరం ఆగస్టు 4 (గరుడ దాద్రి న్యూస్):
కార్వేటినగరం మండలంలో ఆటో నడపడమే తన జీవనాధారంగా జీవిస్తున్న జిలాని భాష కు తన ఆటోలో ఒక పర్సు అందులో 4500 రూపాయలు ఉండడాన్ని గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎస్ఐ తేజస్విని వారికి పర్స్ ను అందించి సమాచారం ఇవ్వడం జరిగింది.
ఓ బాలిక ఆటోలో ప్రయాణిస్తూ మరచి వదిలి వెళ్ళినట్టుగా గుర్తించిన ఎస్సై తేజస్విని ఆ అమ్మాయి స్టేషన్ కు పిలిచి తన పర్స్ అప్పగించారు.ఆటో డ్రైవర్ నిజాయితీకి మెచ్చి ప్రతి ఒక్కరు జిలాని భాష లా నిజాయితీగా ఉండాలని కొనియాడుతూ ఎస్ఐ తేజస్విని దుస్సాలువ కప్పి సన్మానించారు.