కార్వేటినగరం: జూలై 28 గరుడదాద్రి న్యూస్
ఆగస్టు నెలలో 6 7 8 వ తేదీలలో జరిగే వార్షిక ఆడికృతిక బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో, కమిటీ అధ్యక్షులు, డైరెక్టర్లు, మండల శాఖ అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నగరి ఆర్డీవో అనుపమ అన్నారు. కార్వేటి నగరంలోని శ్రీ వల్లి దేవసేన సమేత ఆలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశమునకు ఆలయ కమిటీ అధ్యక్షులు రామిశెట్టి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భక్తుల కోసం ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కొండపైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఎండోమెంట్ ఈవో కృష్ణ నాయక్ ను ఆదేశించారు. అన్ని శాఖల కోఆర్డినేషన్తో ఆడికృత్తిక ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మూడు రోజులు జరిగే ఆ డి కృత్తిక ఉభయ దారులు కూడా దేవునికి తెచ్చే వరస కార్యక్రమాలు త్వరగా తీసుకొని తేప్పోత్సవం 7:00 గంటలకు ప్రారంభమయ్యాల చూడాలని ఆలయ కమిటీ అధ్యక్షులు రాజశేఖర్ కోరారు. అదేవిధంగా కొండపైన స్కంద పుష్కరణ వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆలయ కార్యనిర్వ కార్యదర్శి కృష్ణ నాయక్ పేర్కొన్నారు. కొండ ప్రాంతం పరిసరాలను పరిశుభ్రంగా కార్మికులకే చేపట్టడం జరుగుతుందని ఎంపీడీవో రాధిక సింగిరెడ్డి అన్నారు. కొండపైకి ద్విచక్ర వాహనాలు రాకుండా కిందనే పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తామని ఎస్ఐ తేజస్విని అన్నారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నాగరాజు, ఎస్సై తేజస్విని, డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భానుప్రియ, ఆర్ ఐ నరసింహులు, వైద్య పర్యవేక్షకులు త్యాగు, కమిటీ డైరెక్టర్లు గోవిందస్వామి, అమరావతి, సెల్వి, ఉభయ దారులు తదితరులు �