GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:16 am Digital Edition : GURU SWAMY

ఆడికృత్తిక మహోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

పలమనేరు, ఆగస్టు 07 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఆడికృత్తిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు తీసుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించారు. పలమనేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఆర్వీ బాలాజీ, కుట్టి, సుబ్రహ్మణ్యం గౌడ్, ఖాజా, కృష్ణమూర్తి గౌడ్,మాబాషా, శ్రీధర్, మదన్, బిఆర్సి కుమార్, కిరణ్, సుదర్శన్ బాలాజీ, రమేష్, లక్ష్మీపతి, చిన్నీ, లోకేష్, రెడ్డెప్ప, నరేష్, మేదర వెంకటరమణ మరియు జనసేన నాయకులు హరీష్, మురాదు తదితరులు పాల్గొన్నారు.