ఆడికృత్తిక మహోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

పలమనేరు, ఆగస్టు 07 ( గరుడ ధాత్రి ) : పలమనేరు మున్సిపల్ పరిధిలోని టీఎస్ అగ్రహారంలో వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన ఆడికృత్తిక మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు తీసుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించారు. పలమనేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల జీవితాల్లో...