GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 3:05 pm Digital Edition : GURU SWAMY

ఆదర్శ కుప్పంకు కట్టుబడి ఉన్న ప్రభుత్వం

-గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీ
-వికసితభారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్
-ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం
కుప్పం,జులై 02 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీసింది ఎందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పి.ఎస్. మునిరత్నం అన్నారు. గురువారం కుప్పం నియోజకవర్గం, కుప్పం మండలంలోని జరుగు
గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ గ్రామ అభియాన్ కార్యక్రమంలో అయినా పాల్గొన్నారు. ప్రారంభ పూజా కార్యక్రమం సందర్భంగా కొబ్బరి మొక్కను నాటారు. అనంతరం “125 రోజులు – గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీ” కార్యక్రమంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ, సంక్షేమ పథకాల ద్వారా గ్రామీణ ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కుప్పం నియోజకవర్గంలో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కుప్పంను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజగోపాల్, మాజీ ఎంపీపీ డాక్టర్ వి వెంకటేష్, సంతోష్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులు, ప్రజాప్రతినిధులు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.