ఆదిమూలం నిస్వార్థ నాయకుడు… టీడీపీ సీనియర్ నేత ఇళంగోవన్ రెడ్డి

* ప్రచార ఆర్భాటాలకు దూరం - ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు పిచ్చాటూరు జూలై 09 గరుడధాత్రి : ప్రతికూల పరిస్థితుల్లోనూ నాయకత్వ హుందాతనాన్ని ప్రదర్శిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నిస్వార్థ నాయకుడని టీడీపీ సీనియర్ నాయకుడు, పిచ్చాటూరు మండల మాజీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇన్‌చార్జ్ ఇళంగోవన్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇళంగోవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆదిమూలం ప్రచార ఆర్భాటాలతో ప్రగల్భాలు...